Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ సోదాలు గురువారంతో ముగిసాయి. న్యూఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళ, బుధ, గురువారాల్లో మూడు రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా సంస్థ ఆర్థిక కార్యక్రమాలపై ఐటీ ఆధికారులు ఆరా తీశారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీబీసీపై ఐటీ చర్య ద్వారా భారతదేశ ప్రతిష్టను మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. ఐటి సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. 'ప్రభుత్వ విధానాలను లేదా పాలక వ్యవస్థను విమర్శించే పత్రికా సంస్థలను భయపెట్టడానికి, వేధించడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించే ధోరణికి కొనసాగింపుగానే ఈ సోదాలు ఉన్నాయి' అని ప్రకటనలో తెలిపింది.