Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరెస్సెస్‌తో సమావేశంపై జమాతే ఇస్లామీని ప్రశ్నించిన కేరళ సీఎం
- ఏం చర్చించారో మరింత స్పష్టతనివ్వాలన్న విజయన్
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆరెస్సెస్‌తో జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) సమావేశాన్ని కేరళ సీఎం తప్పుబట్టారు. మైనారిటీల తరఫున ప్రాతినిథ్యం వహించే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌తో చర్చలు అవసరమని జేఐహెచ్ చెప్పడం దాని స్వంత కపటత్వాన్ని ప్రతిబింబిస్తున్నదని అన్నారు.దీనికి సంబంధించి విజయన్ ఒక ఫేస్బుక్ పోస్టును చేశారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మూక హత్యలు, అణగారిన వర్గాల అణచివేత అంశాలపై ఆరెస్సెస్‌తో చర్చల్లో దృష్టి సారించామని జేఐహెచ్ ప్రధాన కార్యదర్శి టి. ఆరీఫ్ అలీ ఇటీవల వెల్లడించారు. అయితే, ఆరెస్సెస్‌తో ఏం చర్చించారన్నదానిపై మరింత స్పష్టత కావాలని విజయన్ అన్నారు. చర్చల ద్వారా ఆరెస్సెస్‌లో మార్పు వస్తుందన్న జమాతే ఇస్లామీ హింద్ వాదన వింతగా ఉన్నదనీ వివరించారు. ఈ తర్కం.. స్నానంతో చిరుతపై ఉన్న మచ్చలను తొలగించవచ్చన్న రీతిలో ఉన్నదని పేర్కొన్నారు. భారత్‌లోని మైనారిటీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను తెలియజెప్పడానికి చర్చలు జరిపామన్న వాదని మరింత వింతగా ఉన్నదని వివరించారు.ఈ చర్చలు దేశంలోని మైనారిటీలకు తోడ్పాటును అందించవని పేర్కొన్నారు. మైనారిటీల రక్షణ అంటే మతస్వేచ్ఛ అనీ, దానికి విఘాతం కలిగిస్తున్నదెవరో తెలియదా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారితో (ఆరెస్సెస్) చర్చలు జరిపితే లాకికవాదం, మైనారిటీల రక్షణ ఎలా సాధ్యమవుతుంది? అని వివరించారు. ఈ చర్చలు ఆరెస్సెస్ హిందూత్వ అజెండాకు మద్దతు ఇచ్చినట్టుగా కనిపించిందని విజయన్ పేర్కొన్నారు. నేడు భారత్‌లో లౌకిక శక్తులు సంఫ్‌ు పరివార్ అతివాద హిందూత్వ రాజకీయాలపై పోరాటం చేస్తున్నాయనీ, ఇలాంటి తరుణంలో ఇలాంటి చర్యలు ఆరెస్సెస్ అజెండాకు మద్దతునిస్తాయని వివరించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను తొక్కిపెట్టడానికి మతవాదులు ఏకమవు తారనడానికి ఇంత కంటే మించిన రుజువు ఉండదనీ, లౌకిక శక్తులకు ఇది ఒక సవాల్ అని విజయన్ పేర్కొన్నారు. ఈ జమాతే ఇస్లామీ హింద్ చర్యపై పలు ముస్లిం, మైనారిటీ సంఘాలకు చెందిన నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది.