Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: శివసేన పేరు, పార్టీ గుర్తు కోసం రూ 2 వేల కోట్లకు ఒప్పందం జరిగిందని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాక్రే) ఎంపీ సంజయ్‌రౌత్ ఆరోపించారు. శివసేన పేరును, పార్టీ గుర్తును రూ. 2 వేల కోట్లకు ఏక్నాథ్ శిండే గ్రూపు కొనుగోలు చేసిందని సంజయ్రౌ త్ ఆదివారం ఆరోపించారు. ఈ విషయాన్ని ఆదివారం సంజరు రౌత్ ట్వీట్ చేశారు. 'శివసేన పేరు, గుర్తు పొందడానికి రూ. 2000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగినట్లు నా వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉంది. రూ. 2,000 కోట్లు అనేది ప్రాథమిక సంఖ్య. ఇది 100 శాతం నిజం. అనేక విషయాలు త్వరలో వెల్లడి చేయబడతాయి. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు' అని రౌత్ ట్వీట్ చేశారు. దీనిపై ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక బిల్డర్ ఈ సమాచారాన్ని తనతో పంచుకున్నారని తెలిపారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని చెప్పారు. శివసేన పార్టీ పేరు కొనుగోలు కోసం రూ. 2000 కోట్లు తక్కువ మొత్తం కాదని చెప్పారు. 'ఎన్నికల కమిషన్ నిర్ణయం ఒక ఒప్పందం' అని సంజయ్ రౌత్ ఆరోపించారు.