Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌహతి : అసోంలో జరుగుతున్న అక్రమ బొగ్గు మైనింగ్ వెనక కొంత మంది బీజేపీ నాయకులు ఉన్నారని అసోం జాతీయ పరిషద్ (ఏజేపీ) ఆరోపించింది. ఈ విషయంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, ఎన్జిటి, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేతకు వినతిపత్రాలను పంపింది. ఈ సందర్భంగా ఎజెపి అధ్యక్షులు లురింజ్యోతి గొగొరు, ప్రధాన కార్యదర్శి జగదీశ్ భుయాన్ విలేకరులతో మాట్లాడారు.
అసోంతో పాటు మేఘలాయ, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల అండదండలతో అక్రమమైనింగ్ జరుగుతుందని ఆరోపించారు. అక్రమ మైనింగ్లపై 2014లో ఎన్జీటీ నిషేధం విధించినా అక్రమమైనింగ్ కొనసాగుతుందని తెలిపారు. అస్సాంలో నెలకు రూ 2 వేల కోట్ల విలువైన అక్రమమైనింగ్ తవ్వకం, రవాణా జరుగుతుందని ఏజేపీ తన వినతిపత్రంలో ఆరోపించింది. అక్రమ మైనింగ్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గౌహతి హైకోర్టు రిటైర్ట్ జడ్జీ నేతృత్వంలోని విచారణ బృందం తన నివేదికలో ధ్రువీకరించిన విషయాన్నిఏజేపీ గుర్తు చేసింది.