Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐకి ఢిల్లీ డిప్యూటీ సీఎంమనీశ్ సిసోడియా లేఖ
న్యూఢిల్లీ : రాష్ట్ర బడ్జెట్ కసరత్తులో ఉన్నాననీ, తన విచారణ వాయిదా వేయాలని సీబీఐకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆదివారం తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సమాన్లు జారీ చేసింది. అయితే, తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని సిసోడియా ఆదివారం సీబీఐని కోరారు. ఢిల్లీ బడ్జెట్ను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్నందున తనకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 'బడ్జెట్ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా నా కర్తవ్యం. ఇది చాలా కీలకమైన ప్రక్రియ. దీని కోసం 24 గంటలు పని చేస్తున్నా. బడ్జెట్ను ఖరారు చేస్తున్న నేపథ్యంలో.. సమయం కావాలని సీబీఐకి లేఖ రాశా. ఫిబ్రవరి చివరి వారం తరువాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరా' అని సిసోడియా మీడియాకు తెలిపారు.