Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల వలన పర్యావరణం దెబ్బతినే ప్రమాదంలో ఉన్న ప్రపంచలోని టాప్ 50 ప్రాంతాలలో భారత్ నుంచి పలు రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో బీహార్, యూపీ, మహారాష్ట్ర, పంజాబ్‌తో సహా తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. కొత్త ప్రచురించిన ఎక్స్డీఐ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం.. 2050లో అత్యంత ప్రమాదంలో ఉన్న టాప్ 50 రాష్ట్రాలు, ప్రావిన్సులలో యూఎస్, భారత్‌ల నుంచి అధికంగా ఉన్నాయి. ఉన్నాయి. భారత్ నుంచి బీహార్ (22వ స్థానం), యూపీ (25), అసోం (28), రాజస్థాన్ (32), తమిళనాడు (36), మహారాష్ట్ర (38), గుజరాత్ (48), పంజాబ్ (50) లు ఉన్నాయి. 1990తో పోలిస్తే 2050 నాటికి అసోం గరిష్టంగా 330 శాతం పెరుగుదలను చూస్తుంది. పాకిస్తాన్ కూడా సింధ్ ప్రావిన్స్‌తో సహా టాప్ 100లో అనేక ప్రావిన్సులను కలిగి ఉన్నది. గతేడాది జూన్-ఆగస్టు మధ్య సంభవించిన వినాశకరమైన వరదుల పాకిస్థాన్‌లోని 30 శాతం ప్రాంతంపై ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. సింధ్ ప్రావిన్స్‌లోనే తొమ్మిది లక్షలకు పైగా ఇండ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. యూఎస్‌లో ఆర్థికంగా ముఖ్యమైన కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. టాప్-50లో ఉన్న బహుళ ప్రావిన్సులు, రాష్ట్రాలతో ఉన్న ఇతర దేశాల్లో పాకిస్థాన్, ఇండోనేషియాలు ఉన్నాయి. ఐరోపా నుంచి లండన్, మిలన్, మ్యూనిచ్, వెనిస్ వంటి ప్రముఖ నగరాలు ఉన్నాయి.