Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారనీ, ఈ దాడిలో ఇంటి కిటికీలు దెబ్బతిన్నా యని అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి తన ఇంటిపై అగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారనీ, ఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాలుగో ఘటన అని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీ ఇంటికి 11.30 గంటలకు తిరిగిరాగా రాళ్ల దాడి జరిగినట్టు పనివాళ్లు చెప్పారనీ, ఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఇంట్లోని దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు ఈ దాడి జరిగిందని అన్నారు. ఎంపీ ఫిర్యాదుతో ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడి ఆధారాలు సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసి కోరారు. రాళ్ల దాడిలో కొన్ని కిటికిలు దెబ్బతిన్నాయనీ, అయితే ఎవరికీ గాయాలు కాలేదనీ, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఒవైసి నుంచి ఫిర్యాదు అందిందని పోలీసు లు తెలిపారు. 'మేం ఫిర్యాదును స్వీకరించాం. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తు న్నాం. విధ్వంసకారులను త్వరలో గుర్తిస్తాం. సాయంత్రం వచ్చి రాళ్లు రువ్వా రు. కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు'' అని ఓ అధికారి తెలిపారు. అస దుద్దీన్ ఓవైసీ ఇళ్లు అధిక భద్రతా జోన్‌గా అని పిలవబడే ప్రాంతంలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం పక్కన, పార్లమెంటుకు సమీపంలో ఉంది.