Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : దళిత విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య సంస్థాగత హత్య అని, బాంబే ఐఐటి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఇక్కడి మెయిన్ గేట్ వద్ద సోమవారం ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా, జెఎఎస్ఎస్ ఆధ్వర్యాన ఆందోళన చేశారు. దర్శన్ సోలంకిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని అరెస్టు చేయాలని, వారిపై ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్శన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని కోరారు.