Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థి విద్యార్హతల ఆధారంగా ఓటు వేయరు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశంలో ఒక్క కేరళలోనే అభ్యర్థి విద్యార్హతల ఆధారంగా ఓటు వేస్తారని, మరెక్కడ అలా ఉండదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి బీజేపీకి చెందిన హర్షవర్ధన్ బాజ్‌పేయి ఎన్నికను అనర్హతగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశంలో ఎన్నికల విషయానికి వస్తే, అభ్యర్థుల విద్యార్హతలు కేరళ రాష్ట్రంలో తప్ప, మిగతా ఎక్కడా ఉండవని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. చాలా మంది ఓటర్లు ఓటు వేసే ముందు అభ్యర్థి విద్యార్హత గురించి చూడరని ధర్మాసనం పేర్కొంది. ''మన దేశంలో విద్యార్హతల ఆధారంగా ఎవరూ ఓటు వేయరు'' అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. వెంటనే ''కేరళలో తప్ప'' అని జస్టిస్ నాగరత్న జోడించారు. 2007, 2012, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లలో తన సరైన విద్యార్హతలు, బాధ్యతలను వెల్లడించకుండా బాజ్‌పేయి అవినీతి చర్యలకు పాల్పడ్డారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనుగ్రV్‌ా నారాయణ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017లో ఇంగ్లాండ్‌లోని 'షెఫర్డ్' అనే నాన్-ఇంగ్లాండ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందినట్లు బాజ్‌పేయి చెప్పారని, అయితే 2007, 2012లో తాను ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందినట్లు చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. బాజ్‌పేయి 2006లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీని కలిగి ఉన్నారని కూడా పేర్కొన్నారనీ, అయితే ఆయన అదే సంవత్సరం బీటెక్ పరీక్షలో ఉత్తీర్ణుడైనట్టు తెలిపారు.