Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణలపై దర్యాప్తు
- ప్రివిలేజ్ కమిటీకి రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ ఆదేశం
న్యూఢిల్లీ : 12 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై విచారణకు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ ఆదేశించారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన ఆ.. 12 మంది ఎంపీలపై విచారణ చేయాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని సూచించారు. పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఇటీవల ముగిశాయి. ఈ సమావేశాల్లో రాజ్యసభలో అదానీ కంపెనీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఈ అంశంపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీని విచారణ చేయాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ ఆదేశించారు. మొత్తం12 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీల్లో తొమ్మిది మంది కాంగ్రెస్కు చెందిన ఎంపీలు కాగా, మిగిలిన ముగ్గురు ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు శక్తి సిన్హా గోయల్, నార్ బాయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కుమార్ కేత్కర్, ప్రతాప్ గర్హి, ఎల్. హనుమంతయ్య, పూలో దేవి నేతమ్, మాథర్ హిషామ్ , రంజిత్ రంజన్ లు కాగా, ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్ , సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్ లు ఉన్నారు.