Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రాష్ట్ర విభజనపై ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం బుధవారం విచారించింది. రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో సుప్రీం ఈ కేసును వాయిదా వేసింది. కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లపై మాత్రమే బుధ, గురువారాల్లో వాదనలకు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం, రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లపై బుధవారం జరగాల్సిన విచారణ ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.