Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షేర్లకు వికీపీడియా సెగ
- రూ.51వేల కోట్ల నష్టాలు
ముంబయి: అదాని గ్రూపు అప్పులు, సెక్యూరిటీలపై సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆరా తీస్తోంది. గౌతం అదానీ కంపెనీలు తీవ్ర ఎకౌంటెన్సీ లోపాలు, కృత్రిమంగా షేర్ల ధరల పెరుగుదలకు పాల్పడుతు న్నాయని హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టు నేపథ్యంలో సెబీ తాజా పరిశీలనకు ఉపక్రమిం చిందని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. తీసుకున్న రుణాలు, జారీ చేసిన సెక్యూరిటీలపై రేటింగ్స్‌ను తెలియ జేయాలని దేశీయ రేటింగ్ సంస్థలను సెబీ ఆదేశిం చిందని సమాచారం. ఈ పరిణామానికి తోడు ఇప్పటికే హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ప్రారంభమైన అదాని సంపద పతనం.. తాజాగా వికీపీడియా ఆరోపణల తో మరింత క్షీణించింది. చెల్లింపు ఎడిటర్లను పెట్టుకని అదాని గ్రూపు తనకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని వికీపీడియా ఆరోపణ లు ఆ కంపెనీ షేర్లను మరింత ఒత్తిడికి గురి చేశా యి. ఈ పరిణామాలతో బుధవారం అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.51,000 కోట్లు ఆవిరయ్యింది. గౌతం అదాని కీలక కంపెనీ అయినా అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ బిఎస్ఇలో ఏకంగా 10.43 శాతం లేదా రూ.163.55 పతనమై రూ.1,404.85కు పడిపోయింది. ఉదయం రూ. 1,539 వద్ద ప్రారంభమైన ఈ సూచీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని.. ఇంట్రాడేలో ఏకంగా రూ.1,381 కనిష్ట స్థాయికి జారింది. నెల రోజుల్లో అదాని స్టాక్స్ 60 శాతం మేర పతనం కావడంతో గౌతం అదాని సంపద రూ.12 లక్షల కోట్ల మేర హరించుకు పోయింది. అదాని గ్రూపు సంస్థలు పలు మ్యూచు వల్ ఫండ్స్ సంస్థలకు ముందస్తు చెల్లింపులు చేయడానికి ముందుకు వచ్చాయన్న వార్తలు ఆ స్టాక్స్ ఎలాంటి మద్దతును ఇవ్వకపోవడం గమనార్హం. ఇకపై కొత్త ప్రాజెక్టులను చేపట్టబోమని అదాని గ్రూపు సిఎఫ్ఒ జుగేశిందర్ సింగ్ వెల్లడించారు. ముంద్రాలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ ప్లాంట్ నిర్మాణ ప్రణాళికలను పునర్ సమీక్షించుకోను న్నామన్నారు. ఎలాంటి కొత్త రోడ్డు ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేమని ఆ కంపెనీ తెలిపింది.