Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ఆదేశాలు
చెన్క్నె : అన్నాడిఎంకె నాయకత్వ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్నాడిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి (ఇపిఎస్) కొనసాగుతారంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోనుత న్యాయస్థానం సమర్థించింది. దీంతో అన్నాడిఎంకెపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి మరో మాజీ సిఎం పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం (ఒపిఎస్) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత ఏడాది జూలై 11న జరిగిన అన్నాడిఎంకె జనరల్ కమిటీ సమావేశంలో పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక చెల్లదంటూ పన్నీర్‌సెల్వం, జనరల్ కమిటీ సభ్యులు వైరముత్తు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారంటూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 2016లో ఎఐఎడిఎంకె అధ్యక్షులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం ఇపిఎస్, ఒపిఎస్ అధికార పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే.