Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనక్కి తగ్గిన ఎస్కేయూ
- ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో సర్క్యులర్ జారీ
అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో నేడు నిర్వహించ తలపెట్టిన శ్రీ ధన్వంతరి మహామృత్యుంజయ శాంతి హోమం రద్దయింది. ఈ మేరకు తాజా సర్క్యులర్ జారీ అయింది. వాస్తవానికి నేడు (24న) యూనివర్సిటీలో హోమం నిర్వహించాలంటు ఈనెల 16న ఒక సర్క్యులర్ జారీ అయింది. వివిధ మతాలకు చెందినవారు విద్యనభ్యసించే ఒక యూనివర్సిటీలో హోమం నిర్వహించడంపై వర్సిటీ ఉద్యోగులతో పాటు అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. శాస్త్ర, సాంకేతిక విషయాలకు కేంద్రాలుగా ఉన్న యూనివర్సిటీలను.. అశాస్త్రీయ కార్యక్రమాలతో తిరోగమనదిశలోకి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు యూనివర్సిటీ యంత్రాంగం దిగి వచ్చింది. హోమం జరిపించడంపై వెనకడుగు వేసింది. ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ రిజిస్ట్రార్ కొత్తగా సర్క్యులర్ జారీ చేశారు.