Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలోని ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 1 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఉద్యోగ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. వేతనాల పెరుగుదలకు సంబంధించి బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదని.. దీంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్టు ప్రకటించాయి. 7వ వేతన కమిషన్ స్కేల్‌ను అనుసరించి వేతన సవరణ ఉంటుందని ఉద్యోగ సంఘాలు భావించాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో బొమ్మై ఎలాంటి ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లను నెరవేరుస్తామని సీఎం హామీ ఇస్తేనే.. సమ్మెను విరమిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఏడు రోజుల్లోగా వేతన పెంపుదలకు సంబంధించి ప్రకటన రాకపోతే.. నిరవధిక సమ్మె తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.