Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్నినో పరిస్థితులకు అవకాశాలు
- మే-జూన్లో ఏర్పడే ఛాన్స్
- వాతావరణ నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : భారత్లో ఈ ఏడాది తక్కువ వర్షపాతాలు నమోదుకానున్నాయా? రైతన్నలకు కష్టకాలాన్ని మిగల్చనున్నదా? అంటే అవుననే సమాధానం వినబడుతున్నది. ఈ ఏడాది ఎన్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదనీ, ఇది లోటు వర్షపాతానికి దారి తీయొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇది ముఖ్యంగా రైతులకు ఆందోళన కలిగించే విషయమని విశ్లేషకులు చెప్పారు. ఎల్నినో పరిస్థితులు తక్కువ వర్షపాతాన్ని, లానినో పరిస్థితులు అధిక వర్షాభావ పరిస్థిలను కల్పిస్తాయి. ఈ ఏడాది లానినో పరిస్థితులు దూరమవుతాయని ఈ ఏడాది ప్రారంభంలోనే ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఫసిపిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న పరిస్థితులు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తున్నది. ఇలా మారుతున్న పరిస్థితుల వలన తేలికపాటి ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయని వావరణ నిపుణులు తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు లానినో దిశగా ఉన్నా.. ఇప్పుడు పరిస్థితులు మారనున్నాయని చెప్పారు. ఈ ఏడాది మే-జులై లో ఎల్నినో వెనక్కి వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు.
ఈ ఎల్నినో 2015-16 నాటి ఎల్నినో లాగా బలమైనదా? అన్నదానిపై రాబోయే కాలంలో కొన్ని సూచనలు అందుతాయని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ప్రొఫెసర్ రఘు ముర్తుగుడ్డె తెలిపారు. '' ఎల్నినో పరిస్థితి వేసవిలో ఏర్పడుతుంది. ఈ ఏడాది మనం లోటు వర్షపాతాన్ని చూసే అవకాశం చాలా ఎక్కువ'' అని రఘు చెప్పారు. అయితే, ఎల్నినో పరిస్థితులను అంచనాకు అందవనే పేరున్నదని కూడా వాతావరణ నిపుణులు వెల్లడించడం గమనార్హం.