Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేఘాలయ బీజేపీ చీఫ్
షిల్లాంగ్ : తాను బీఫ్ (ఆవు మాంసం) తింటానని మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఫ్‌పై నిషేధం లేదనీ, ఇతర రాష్ట్రాలు విధించిన ఆంక్షలపై తాను ప్రకటన చేయనని అన్నారు. తమ రాష్ట్రంతో పాటు తాను కూడా బీఫ్‌ను ఆహారంగా తీసుకుంటానని స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల జీవన శైలిలో బీఫ్ కూడా భాగమనీ, దీనిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. భారతదేశంలో కూడా అలాంటి నియమం లేదని... కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇటువంటి చట్టాలను ఆమోదించాయని అన్నారు. రాష్ట్రంలో కబేళాలు పరిశుభ్రంగా ఉన్నాయనీ, ఆవులు, పందులను తీసుకువస్తారని.. ప్రజలు వారి ఆహారపు అలవాట్లను అనుసరించి తీసుకుంటారని అన్నారు. ఈ నెల 27న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్నెస్ట్ మావ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనీ, ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత ప్రాంతమైన అసోంలో పశువధ, గో మాంసం రవాణా, విక్రయాలపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. హిందువులు నివసించే ప్రాంతాల్లో బీఫ్ తినడంపై నిషేధం విధించాలంటూ ఈశాన్య రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.