Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు బలగాల మోహరింపులో ఆలస్యం
- బీజేపీ ద్వేషపూరిత ప్రచారం..
- మీడియా కల్పిత కథనాలు : నిజనిర్ధారణ కమిటీ వెల్లడి
న్యూఢిల్లీ: నేటికి సరిగ్గా మూడేం డ్ల క్రితం చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లు ఇప్పటికీ మానని గాయాలను మిగి ల్చాయి. బీజేపీ నాయకుల తీరుతో ఆ అల్లర్లు రెండు వర్గాల మధ్య గొడవగా చిత్రీకరించబడ్డాయి. వివాదాస్పద పౌరసత్వ సరవణ చట్టం (సీఏఏ)పై కేంద్రం మొండి వైఖరిపై అప్పట్లో దేశరాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలకు దారి తీసి న విషయం తెలిసిందే. అటు తర్వాత ఈశాన్య ఢిల్లీలో ఈ ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. భౌతిక దాడులు, రాళ్లు విసురుకోవడంతో పాటు.. కొం దరు వ్యక్తులు తుపాకులతో రావడం వంటి దృశ్యాలు కనబడ్డాయి. ఈ ఘటనలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, పోలీసుల వైఫల్యాన్ని నిజనిర్ధారణ కమిటీ ఎత్తి చూపింది. అల్లర్లతో ప్రభా వితమైన ప్రాంతాల్లో అదనపు బలగా లను మోహరించడంలో ఆలస్యం చేసి ందనీ, ప్రత్యేక బ్రాంచ్, నిఘా విభా గాల నుంచి వచ్చిన హెచ్చరికలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదని వివ రించింది. అలాగే మీడియా కథనాలు, బీజేపీ నాయకుల వ్యవహార శైలి వంటి కారణాలతో ఈశాన్య ఢిల్లీ అలర్లు మూడు రోజుల పాటు కొనసాగి తీవ్ర ఆస్థి, ధన, ప్రాణ నష్టాలను మిగిల్చా యని కమిటీ వెల్లడించింది. 2020 ఫిబ్రవరి అల్లర్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్. బి లోకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీ దర్యాప్తు జరుపుతు న్నది. కేంద్ర హోం శాఖ, ఢిల్లీ పోలీసు ల నిర్లక్ష్య వైఖరిని కమిటీ ఎత్తి చూపటంతో ఈ అంశం చర్చనీయాం శంగా మారింది. అల్లర్లు మొదలయ్యే రోజు ఫిబ్రవరి 23న ఢిల్లీ పోలీసులకు స్పెషల్ బ్రాంచ్, నిఘా యూనిట్ల నుంచి ఆరుసార్లు హెచ్చరికలు వచ్చి నా పట్టించుకోలేదని వివరించింది. ఆ తర్వాత రెండు రోజుల వరకూ అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాలకు అదనపు బలగాలు చేరుకోలేదు. చివరకు ఫిబ్రవరి 26న అదనపు బలగాలను మోహరించడం గమనార్హం. కేంద్ర హోం శాఖ చూపిన ఉదాసీన వైఖరి అల్లర్లు చేసేవారికి ఊతమిచ్చినట్ట యిందనీ, వరుసగా మూడు రోజుల పాటు హింసను మరింతగా సృష్టిం చారనీ కమిటీ వివరించింది. ఎఫ్ఐఆర్ పై కోర్టులో సాక్షాత్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జీషీటు.. కమిటీ ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉం డటం గమనార్హం. ఈ ఎఫ్ఐఆర్లో సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ఉమర్ ఖాలీద్, ఖాలీద్ సైఫీ, ఇష్రత్ జహాన్, గుల్ఫిషా ఫాతిమా, సఫూరా ఝర్గార్, నటాషా నార్వల్, దేవాంగన కలిత, ఇతరులపై ఉపా కింద పేర్లు చేర్చిన విషయం విదితమే. ఢిల్లీ అల్లర్లు చెలరేగిన 23, 24, 25 తేదీలలో మోహరించిన ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాల సిబ్బంది సంఖ్య 1400 మంది లోపే ఉన్నది. అయితే, 26న ఆ సంఖ్య 4200కు పైగా చేరుకున్నది. 25న 3500 అత్యవసర ఫోన్ కాల్స్ రాగా, 26న 1500కు పడిపోయాయి. మొత్తానికి కేంద్ర హోం శాఖ నిర్లక్ష్య వైఖరి, ఢిల్లీ పోలీసుల సహకారం, మీడియా విభజిత కథనాలు, సీఏఏకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలలకు పైగా నిరసనల్లో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన ద్వేషపూరిత ప్రచారం.. ఢిల్లీ అల్లర్లకు కారణమైం దని కమిటీ తన దర్యాప్తులో వివరిం చింది.