Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణే : భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ శుక్రవారం మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురైన 89 ఏళ్ల షెకావత్ ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కొన్ని రోజుల క్రితం షెకావత్ ఈ ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు తెలిపారు. 'గుండెపోటు కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు షెకావత్ మరణించారు' అని చెప్పారు. తరువాత పుణేలోనే శుక్రవారం అం్యతక్రియలు నిర్వహించారు. ప్రతిభా పాటిల్-దేవిసింగ్ షెకావత్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.