Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు విన్నవించుకోండి
- నెలసరి సెలవుపై పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ : నెలసరి సెలవుపై విభిన్నమైన 'కోణాలు' ఉన్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యనించింది. ఇది జీవ సంబంధమైన ప్రక్రియ అయినప్పటికీ.. తమ యాజమాన్యాలను నిరాశపర్చకుండా మహిళలు పనిచేయవచ్చనని తెలిపింది. నెలసరి సెలవుపై ఒక విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు విన్నవించు కోవాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. విద్యార్థినిలకు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగినులకు నెలసరి సెలవులు మంజూరు చేయడం కోసం నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ శైలంద్ర మణి త్రిపాఠీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.
నెలసరి సెలవుల విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని ధర్మాసనం ఈ సందర్భంగా వాఖ్యానించింది. 'నెలసరి సెలవులు ఇవ్వాలని యాజమాన్యాలను బలవంతం చేస్తే యాజమాన్యాలు తమ సంస్థల్లో మహిళలను నియమించు కోవడానికి దీనిని మహిళల నియామాకాలను నిరాకరించడానికి ఒక సాధనంగా మార్చుకోవచ్చు' అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.