Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో అత్యధికంగా 92 శాతానికి పైనే..!
- తెలంగాణలో 60 శాతం.. ఏపీలో 71 శాతం మంది
- ఆర్టీఐ సమాధానంలో ఈసీ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ను లింక్ చేసిన వారి సంఖ్య 60 శాతానికి పైగా ఉన్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసుకున్న ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కంటే ముందున్నది. ఇక్కడ 92 శాతం మందికి పైగా ఓటర్లు తమ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ను అనుసంధానించారు. గుజరాత్లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉన్నది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎన్నికల సంఘం (ఈసీ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈసీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. భారత్లో ఉన్న మొత్తం 94.5 కోట్ల మందికి పైగా ఓటర్లలో 56,90,83,090 మంది ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. త్రిపురలో 92.33 శాతం మంది ఓటర్లు ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ను లింక్ చేశారు. త్రిపుర తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ ( 86.19 శాతం మంది), సిక్కిం(80.63 శాతం మంది) లు ఉన్నాయి. తెలంగాణలో 60.04 శాతం మంది, ఏపీలో 71 శాతం మంది ఓటర్లు తమ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ను జత చేశారు.