Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రక్రియకు బిజెపి అంతరాయం
- ఢి అంటే ఢి అన్న ఆప్ సభ్యులు
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (డిఎంసి) కార్యాలయం శుక్రవారం రణరంగంగా మారింది. కార్యాలయంలో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఓట్ల లెక్కింపును బిజెపి కౌన్సిలర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, దానిని ఆప్ కౌన్సిర్లు వ్యతిరేకించారు. దీంతో ఉద్రిక్త వాతావరణ నెలకుంది. ఆప్ కౌన్సిలర్లు, బిజెపి కౌన్సిలర్లు ఢ అంటే ఢ అన్నారు. పరస్పరం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జట్టు పట్టుకొని ఒకరినొకరు ఈడ్చుకున్నారు. చొక్కాలు చించుకుంటూ తీవ్ర గందరగోళం సష్టించారు. కమిటీ సభ్యుల ఎన్నికలో అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను బిజెపి అడ్డుకోవడంతో ఈ ఘర్షణ ప్రారంభయింది. చివరికీ చెల్లుబాటు కాని ఓటును పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాన్ని వెల్లడిస్తానని మేయర్ ప్రకటించారు. కౌన్సిలర్ల పరస్పర దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగిపోయాయి. ఈ గొడవలో ఒక కౌన్సిలర్ మూర్చపోయి కిందపడిపోయారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను బిజెపి అడ్డుకోవడతో తొలుత అధికార ఆప్ కౌన్సిలర్లు టేబుళ్లు ఎక్కి ఆందోళన చేపట్టారు. బిజెపి కౌన్సిలర్లు కూడా ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. తరువాత ఒకరిపై ఒకరు తలపడ్డారు. ఓట్లను రీకౌంట్ చేయడానికి బిజెపి కౌన్సిలర్లు ససేమిరా అన్నారు. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేయనున్న స్టాండింగ్ కమిటీకి ఏడుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు.