Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జీ20 సదస్సుకు ఆతిథ్యమివ్వడంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్దిని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీ-20 సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రు లు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడు తూ.. వాతావరణ మార్పులు, అధిక రుణాల వంటి ప్రపంచసవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో బహుపాక్షిక బ్యాంకుల అభివృద్ధిని బలోపేతం చేయాల్సి వుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మహమ్మారి, యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు దెబ్బతీశాయని అన్నారు. ఈ పరిణామాలతో పలు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నాయని అన్నారు.