Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ వైద్య సంప్రదింపులను సులభతరం చేసే 'ఈ- సంజీవని యాప్ ద్వారా ఇప్పటి వరకు 10 కోట్లకుపైగా భారతీయులు ప్రయోజనం పొందినట్లు ప్రధాని మోడీ తెలిపారు. భారత్ డిజిటల్ విప్లవ సామర్థ్యాన్ని ఈ యాప్ ప్రతిబింబిస్తోందన్నారు. ఆదివారం నిర్వహించిన 98వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. స్థానికంగా 'ఈ- సంజీవని' యాప్ ద్వారా అందుతున్న సేవలపై సిక్కింకు చెందిన ఓ వైద్యుడితో ఈ సందర్భంగా మాట్లాడారు. సామాన్యులు, మధ్యతరగతి, మారుమూల ప్రాంతాలవారికి ఇది 'ప్రాణరక్షక యాప్'గా మారుతోందని చెప్పారు. దేశానికి చెందిన యూపీఐ సింగపూర్ 'పే నౌ' మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.