Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌పార్టీ 85వ ప్లీనరీ ముగింపు సమావేశంలో ప్రియాంక
రాయ్‌పూర్: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని.. బీజేపీపై ఐక్యంగా పోరాడతాయని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా... ఆదివారం కార్యకర్తలనుద్దేశించి ప్రియాంక గాందీ ó మాట్లాడుతూ.. ఇక ఒక్క సంవత్సరం మాత్రమే మిగిలిఉన్నదనీ.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయనీ, అయితే కాంగ్రెస్‌పైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయని అన్నారు. పార్టీ సందేశాన్ని, మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీపై ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కేంద్రం ప్రత్యక్ష దాడులకు దిగుతోందని మండిపడ్డారు. బీజేపీతో పోరాడే ధైర్యం కార్యకర్తలకు ఉన్నదనీ, దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తోందని అన్నారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను కొత్త తరాలకు తెలియజేయాలని కోరారు. మండల స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలను అధిగమించి, సంఘీభావంతో ప్రేమపూర్వక రాజకీయాలు చేద్దామని కార్యకర్తలను కోరారు.