Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా భారీ ప్రణాళికలను రూపొందించుకుంది. రికార్డ్ స్థాయిలో 470 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఎయిరిండియా సిఇఒ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఈ ఒప్పంద విలువ రూ.70 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.7 లక్షల కోట్లు)గా ఉందని తెలిపారు. ఇందుకోసం సోమవారం ఆయన బోయింగ్, ఎయిర్‌బస్‌తో మెగా డీల్‌ను కుదుర్చుకున్నట్లు తెలిపారు. మరో 370 విమానాల కొనుగోలుపై కూడా దృష్టి పెడుతున్నా మన్నారు. నెట్వర్క్, సామర్థ్య విస్తరణపై దృష్టి కేంద్రీకరించామన్నారు. విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేయనుంది. విమానయాన సంస్థ 5వేల పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని నియమించు కోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎయిరిండియా, విస్తారా విలీనం తొలి దశలో ఉందని క్యాంప్‌బెల్ తెలిపారు. 2024 మార్చి నాటికి విలీనం పూర్తయి.. అనంతరం ఎయిరిండియా పేరుతోనే సేవలు కొనసాగుతాయన్నారు.