Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో మూడు, ఏపీలో ఏడు స్థానాలకు ..
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 23న జరగనున్నాయి. అదే రోజు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరగనున్నట్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో ఏడు స్థానాలకు... మార్చి 29తో పదవీకాలం ముగియనున్నది. దీంతో ఆయా స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, వూళ్ళోల్ల గంగాధర్ గౌడ్, కూర్మయ్యగారి నవీన్ కుమార్ , ఏపీ నుంచి ఎమ్మెల్సీలు చల్లా భగీరథ్ రెడ్డి (2022 నవంబర్ 2 నుంచి ఖాళీ), నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది..
నోటిఫికేషన్ మార్చి 6
నామినేషన్లకు గడువు మార్చి 13
నామినేషన్ల పరిశీలన. మార్చి 14
నామినేషన్ల ఉపసంహరణ మార్చి 16
పోలింగ్ మార్చి 23
ఓట్ల లెక్కింపు మార్చి 23