Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 122 ఏండ్ల రికార్డు బ్రేక్ .. సగటున 29.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఐఎండీ వార్నింగ్
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభంలో చలి జనాన్ని వణికిస్తే..ఇపుడు భానుడు ఉగ్రరూపంతో దడపుట్టిస్తున్నాడు. వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసిన సమాచారం ప్రకారం...
ఫిబ్రవరిలో భారతీయ భూభాగం యొక్క సగటు గరిష్ట నెల వారీ ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది, ఇది 1901 నుంచి అత్యధిక స్థాయి అనీ, ఇది 122 ఏండ్ల రికార్డును అధిగమించింది. ఢిల్లీలోనే సగటున 29.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. ఇప్పుడే ఎండలు మండుతుంటే...వచ్చే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు, నార్త్ వెస్ట్ ఇండియాతో పాటు మధ్య , తూర్పు భారతదేశ ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు మాత్రమే సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.ఆ ప్రాంతాల్లోనే అగ్గిమంటల్లా ఎండలు దహించివేస్తున్నాయి.మిగతా రాష్ట్రాల్లో అయితే ఏకంగా 49 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న విషయం విదితమే.
ఏడాది భానుడి ప్రతాపంపై ఐఎండీ తొలి హెచ్చరిక నేపధ్యంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఎండలు మండుతున్న క్రమంలో ప్రజలు తగినంతగా నీరు తాగాలని మార్గదర్శకాల్లో సూచించింది. వేడిగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏం చేయకూడదనే వివరాలతో మార్గదర్శకాలను జారీ చేసింది.
చేయాల్సినవి..
- ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తీసుకోవాలి
- మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు తాగాలి
- వదులైన కాటన్ దుస్తులు ధరించాలి
- గొడుగు, క్యాప్, టవల్‌తో తలను కవర్ చేసుకోవాలి
- చల్లని ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి
- ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయట పనులను చక్కబెట్టుకోవాలి
చేయకూడనివి...
- మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రాకూడదు
- ఒత్తిడితో కూడిన పనులకు దూరం
- చెప్పులు లేకుండా బయటకు రాకూడదు