Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిపిపి టెండర్లలో అనర్హత వేటు
విశాఖ :కార్పొరేట్ అక్రమాల ఘనాపాటి అదానీ పట్ల విశాఖ పోర్టు అప్రమత్త మైంది. గతంలో ఒక బెర్తును అదానీ గ్రూపునకు వైజాగ్ పోర్టు ఇవ్వగా, వ్యాపారం చేయకుండా రూ.వందల కోట్ల భారాన్ని పోర్టుపై మోపడం, కేంద్రంలోని బిజెపి సాయంతో బయటపడే వ్యూహం పన్నగా పోర్టు అధికారులు ఆ కుట్రలు పారకుండా అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యం లో పిపిపి టెండర్లలో అదానీ ఎంట్రీని వైజాగ్ పోర్టు యాజమాన్యం నిషేధిం చింది. వైజాగ్ పోర్టుతో ఎలాంటి లావాదేవీలూ జరపడానికి వీల్లేదంటూ అదానీ గ్రూప్‌పై అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం పిపిపి టెండర్లకు వైజాగ్ పోర్టు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నా అదానీ రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తోంది. దేశంలోని 13 మేజర్ పోర్టుల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ (విపిటి)కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సరుకు రవాణాలో దేశంలో ఒకటి, రెండు స్థానాల్లోనే తరచూ ఉండడం ఈ పోర్టు ప్రత్యేకత. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా గడిచిన ఐదేళ్లలో ఈ పోర్టులోని బెర్తులు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి ఒక్కొక్కటీ వెళ్లిపోతున్నాయి. పోర్టు లోని 23 బెర్తులకుగానూ ఇప్ప టికే తొమ్మిది బెర్టులు పిపిపి కిందకు వెళ్లగా, మరో రెండు బెర్టులు ఇందుకు సిద్ధంగా ఉన్నాయి.
అదానీ కథేమిటి..
విపిటిలో ఇక్యు-1 బెర్తును వ్యాపారం కోసం 2011లో అదానీ చేసుకున్నారు. 2014 చివర్లో వ్యాపారం ప్రారంభించారు. డబ్బులు చెల్లించకుండా పోర్టుకు మస్కా కొట్టి బయటకుపోవాలని 2016లో చూశారు. కేంద్రంలోని బిజెపి సర్కారు వత్తాసుతో ఈ బెర్తును తీసుకుని డిబిఎఫ్ఒటి (డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) కింద అదానీ వైజాగ్ పోర్టులో ఇక్యు-1 టర్మినల్‌ను అభివృద్ధి చేయడానికి అంగీకరించారు. ప్రాజెక్టు ఖర్చు రూ.310 కోట్లు కాగా, అందులో రూ.230 కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రుణంగా పొందారు. టర్మినల్ నిర్మాణం జరిగి ఏడాది మాత్రమే ఈ బెర్తుపై వ్యాపారం చేశారు. ఒప్పందం ప్రకారం ఆదాయంలో 40 శాతం విశాఖ పోర్టుకు బెర్తు ఆపరేటర్ చెల్లించాలి. 1.3 మిలియన్ టన్నుల కార్గో రవాణా ఏటా జరగాలి. ఇలా 30 సంవత్సరాలు నడిపాక వైజాగ్ పోర్టుకు ఆ టర్మినల్‌ను అప్పగించాలి. వరసగా మూడేళ్లపాటు వ్యాపారం చేయకపోయినా బెర్తును వదిలేయాలి. అదానీతోపాటు బెర్తులు తీసుకున్న వేదాంత, వైజాగ్ సీ పోర్టులు వ్యాపార కార్యకలాపాలు ఒప్పందం మేరకు నిర్వహించాయి. వ్యాపార నిర్వహించనందుకు అదానికీ పోర్టు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన సోదర సంస్థ అయిన అదానీ పోర్ట్స్ ఎస్ఇజెడ్ (ఎపిసెజ్) ద్వారా ఐసిఐసిఐ బ్యాంకుకు పాత రుణాన్ని అదానీ చెల్లింపజేసి ఆ బ్యాంకును నెమ్మదిగా తప్పించాడు. వైజాగ్ పోర్టు ఈ ఒప్పందంలో ప్రధాన భాగస్వామి కాగా, ఆ సమాచారాన్ని పోర్టుకు సైతం అదానీ ఇవ్వలేదు. గత అగ్రిమెంట్లో రూ.310 కోట్లు ఉన్న వ్యయాన్ని ఒక్కసారిగా రూ.500 కోట్లకు పెంచేసి పోర్టుతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు 2019లో నోటీసులిచ్చారు. రూ.500 కోట్లలో 90 శాతం చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్‌కు వెళ్లారు. పోర్టు ఈ వ్యవహారంపై చాకచక్యంతో వ్యవహరించింది. పాత ఒప్పందం ప్రకారం 90 శాతం అంటే రూ.280 కోట్లు చెల్లించాల్సి ఉండగా, పోర్టు అది సాధ్యం కాదని రూ.120 కోట్లు మాత్రమే చెల్లించి బెర్తును స్వాధీన పర్చుకుంటామని కేంద్రానికి అప్పట్లో లేఖ రాసింది. ఈ వ్యవహారంపై అధికార బిజెపి ప్రభుత్వం కొన్నాళ్ల పాటు కర్ర పెత్తనం చేసి అదానీకి అనుకూలంగా వ్యవహరించగా, పోర్టు అధికారులు మాత్రం పట్టువిడవకుండా పోరాడారు. ఇలా అదానీ బెర్తును 2021లో స్వాధీనం చేసుకోవడంతో అదానీ కథ కంచికి చేరింది.
తాజాగా ఇక్యు-1 అదానీ బెర్తుపై వ్యాపారం ఇలా...
అదానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఇక్యు-1 బెర్తుపై నెలకు రూ.10 కోట్లుకు తగ్గకుండా తాజాగా వైజాగ్ పోర్టు వ్యాపారం చేయడం గమనార్హం. 2011 ఆగస్టులో పోర్టుతో ఈ బెర్తు కోసం అదానీ ఒప్పందం చేసుకున్నారు. 28 ఎకరాల్లో ఈ బెర్తును 2014 అక్టోబర్ 24 నాటికి పిపిపిలో అభివృద్ధి చేసి సిద్ధం చేశారు. 2015లో కార్గో హేండ్లింగ్ జరిగింది. 2016 ఫిబ్రవరి నుంచి కార్గో ఆగిపోయింది. అదానీని నుంచి స్వాధీనం చేసుకున్న ఈ బెర్తును పిపిపిపై మరో పది రోజుల్లో వేరే సంస్థకు ఇవ్వనుంది. పది రోజుల క్రితం డబ్ల్యుక్యు 7, 8 బెర్తులకు టెండర్లను పిలిచింది. త్వరలోనే అదానీ పాత బెర్తు సహా మరో రెండు బెర్తులను పిపిపికి ఇవ్వనుంది. మొత్తంగా ఈ టెండర్లలో అదానీకి ఎంట్రీ లేకుండా పోర్టు జాగ్రత్త వహిస్తోంది.