Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక ఎన్నికల ముందు కవ్వింపు...
బెంగళూర్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ నోటికి పనిచెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టే కుయుక్తులకు తెరలేపారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజాపూర్ బిజెపి ఎమ్మెల్యే బసనగుడ పాటిల్ ముస్లీం లను టిప్పు సుల్తాన్తో పోల్చారు. ముస్లిం నేతలకు ప్రజలు ఓటు వేయరాదని కోరారు. మీ నియోజకవర్గంలో లక్ష మంది టిప్పు సుల్తాన్లు ఉండగా శివాజీ మహరాజ్ సంతతికి చెందిన మీరు బీజాపూర్ నుంచి ఎలా గెలుస్తారని ఎమ్మెల్యేలంందరూ తనను అడుగుతున్నారని చెప్పారు. బీజాపూర్లో టిప్పు సుల్తాన్ అనుచరులెవరూ గెలవరనీ, శివాజీ సంతతికి చెందిన వారే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. మీరు పొరపాటున కూడా ముస్లింలకు ఓటు వేయవద్దని ఆయన కోరారు. ముస్లింలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ తరహా చిత్రీకరణలు అసంబద్ధమని పేర్కొంది. కన్నడిగులుగా మనం ప్రగతిశీల రాజకీయాలను కోరుకోవాలని మీరు అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ప్రజలను ఓట్లు అడగాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే కోరారు.