Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబినెట్‌ను వీడిన సిసోడియా, సత్యేందర్ జైన్
న్యూఢిల్లీ : ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అరెస్టయిన ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు మంగళవారం కేజ్రీవాల్ క్యాబినెట్‌కు రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. మంత్రి సత్యేందర్ జైన్ సైతం రాజీనామా సమర్పించారు. ఇరువురి రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించినట్టు సమాచారం. గతంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
హైకోర్టుకు వెళ్లండి.. : సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సీబీఐ అరెస్టు వ్యవహారాన్ని సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చనని సిసోడియాకు సూచించింది. సీబీఐ ఛార్జీషీటులో సిసోడియా పేరు లేకున్నా ఆయన్ను అరెస్టు చేయడం అక్రమమని ఆయన తరపున న్యాయవాది న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.