Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో బీజేపీ సర్కార్ నిర్వాకం
- ఈ-టెండరింగ్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన
- బారికేడ్లు, జలఫిరంగులతో అడ్డగింత..
- పలువురికి గాయాలు
పంచకుల: హర్యానాలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా సర్పంచ్‌లు కదం తొక్కారు. ఈ-టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం తమ నిరసన తెలియజేయటానికి చండీగఢ్ వెళ్తున్న సర్పంచ్‌లను పంచకులలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సర్పంచ్‌లు బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లటానికి ప్రయత్నించగా...ఆందోళనకారులపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు.అప్పటికి నియంత్రించలేకపోయిన బలగాలు జలఫిరంగులు ప్రయోగించింది. దీంతో పలువురు సర్పంచ్‌లకు గాయాలయ్యాయి.
ఎందుకీ రగడ...?
హర్యానా ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులకు ఈ-టెండరింగ్‌ను తప్పనిసరి చేసింది. దీంతో సర్పంచ్‌లందరూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో 20 లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. పూర్తిగా టెండర్లు వేసుకునే అధికారం సర్పంచ్ లకే ఉండేది.
.ఇప్పుడు ఖట్టర్ సర్కార్ ఇచ్చిన తాజా మార్గదర్శకాలతో... కనీసం వీధి-డ్రెయిన్‌ను కూడా శుభ్రపర్చలేకపోతున్నామని సర్పంచులు అంటున్నారు. సీఎం ఖట్టర్ ఇంటిని ముట్టడించటానికి బయలుదేరిన సర్పంచులపై పోలీసులు వీరంగం సృష్టించారు. గాయాలపాలైన సర్పంచులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హర్యానాలో బీజేపీకి నిరసన సెగలు తాకుతున్నాయి.