Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆమెను పరిశీలిస్తున్నామనీ, పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. సోనియా గాంధీని డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం పర్య వేక్షిస్తున్నది. గురువారమే ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా.. సోనియా గాంధీ (76) ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.