Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కర్నాటకలో హిజాబ్ బ్యాన్పై దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నది. కర్నాటకలోని ప్రభుత్వ కళాశాలల్లో ముస్లిం విద్యార్థులను హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ధర్మాసనం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈనెల 9 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిపై త్వరగా విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర షరియత్ కమిటీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ తర్వాతే న్యాయస్థానం ధర్మాసనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నది. తొలుత ఈ పిటిషన్ సీజేఐ డి.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జె.బి పార్దివాలా, పి.ఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణను హోలీ పండుగత తర్వాత విచారిస్తామని సీజేఐ తెలిపారు. అయితే, న్యాయవాది అభ్యర్థన మేరకు దీనిపై బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీజేఐ చెప్పారు.