Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి కేరళలో చోటు లేదు : సీపీఐ(ఎం), కాంగ్రెస్
- ఇక్కడి ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు : ఐయుఎంఎల్
న్యూఢిల్లీ : మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. న్యూఢిల్లీలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతూ, కేరళలో బీజేపీ కూటమి అధికారంలోకి రావటం తన కలగా ప్రధాని చెప్పుకొచ్చారు. అయితే కేరళకు సంబంధించి ఆయన కల..కలగానే మిగిలిపోతుం దని సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐయుఎంఎల్ పార్టీలు స్పందించాయి. ఎన్డీయే అధికార రాష్ట్రాల జాబితాలో కేరళ చేరదని, క్షేత్రస్థాయిలో అలాంటి అవకాశమే లేదని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీల నాయకులు వ్యాఖ్యానించారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఎం.ఎ.బేబి మాట్లాడు తూ, ''ప్రధాని మోడీదంతా పగటి కల. కాషాయ పార్టీకి ఒక్క విషయం ఇక్కడ గుర్తుచేయాలి. కేరళలో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క స్థానం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోయింది. ఆ స్థానాన్ని లెఫ్ట్ ఫ్రంట్ కైవసం చేసుకుంది. కేరళలో బీజేపీ పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. దీనినిబట్టే ప్రధాని మోడీ కల.. నెరవేరే అవకాశమే కేరళలో లేదు'' అని వివరించారు. కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.డి.సతీశన్ మాట్లాడుతూ, ''కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఫాసిస్టు, ఫ్యూడల్ భావజాలానికి ఇక్కడి ప్రజలు మొదట్నుంచీ వ్యతిరేకం. బీజేపీ రాజకయాలకు ఇక్కడ స్థానమే లేదు. మతతత్వ శక్తులకు కేరళ ప్రజలు చోటివ్వరు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, యుడీఎఫ్ ఎప్పుడూ ముందుంటుంది'' అని అన్నారు. కాంగ్రెస్ మిత్ర పక్షం 'ఐయుఎంఎల్' కూడా ఇదే అభిప్రాయా న్ని వ్యక్తం చేసింది. ''క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిపై ప్రధాని మోడీకి అవగాహన లేదు. మతతత్వ శక్తులు ఎన్నోమార్లు ఇక్కడ రాజకీయంగా గెలవడానికి ప్రయత్నించాయి. కానీ ఎన్నడూ అది సాధ్యపడలేదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు రాజకీయంగా చైతన్య వంతులు'' అని ఐయుఎంఎల్ నాయకుడు ఎం.కె. మునీర్ అన్నారు. త్రిపుర, మేఘా లయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ చేసిన ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించు కుంది. మైనార్టీల మద్దతుతో మూడు రాష్ట్రాల్లో బీజేపీ తన స్థానాన్ని ఎలాగైతే బలపర్చుకుందో, అలాగే కేరళలోనూ జరుగుతుందన్నారు.