Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : త్రిపురలో తుది ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ మొత్తం 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ కూటమి స్వల్ప మెజారిటీ దిశగా పయనిస్తోందని సీపీఐ(ఎం) పేర్కొంది. త్రిపుర ఫలితాలపై పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం వ్యాఖ్యానిస్తూ, 2018 ఎన్ని కల్లో 44 సీట్లు పొందిన బీజేపీ కూటమి ఈసారి బటాబొటీ మెజారిటీతో సరిపెట్టు కోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఎన్ని కల్లో బీజేపీ అసాధారణ రీతిలో డబ్బు కుమ్మరించి, స్వల్ప మెజార్టీతో బయటపడింది. బీజేపీని తిరస్కరించి, వామపక్ష సంఘటన, ప్రతిపక్ష అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలను సీపీఐ(ఎం) అభినందించింది. గత ఐదేండ్లుగా ఎదురవుతున్న తీవ్రమైన అణచివేతను కూడా ఎదుర్కొని ధైర్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన వేలాది మంది సీపీఐ(ఎం), వామపక్ష సంఘటన కార్యకర్తలకు పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియజేసింది. బీజేపీ ప్రభుత్వం అనుసరించిన క్రూర నిర్బంధం వల్ల కార్యకర్తలెవరూ దీర్ఘకాలంగా ప్రజలను కలుసు కోలేక పోయారని పేర్కొంది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మరింత నిబద్ధత, శక్తి సామర్ధ్యాలతో సీపీఐ(ఎం), వామపక్ష సంఘటన్ కృషి చేస్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.