Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవును జాతీయ రక్షిత జంతువుగా ప్రకటించండి
- కేంద్రాన్ని కోరిన అలహాబాద్ హైకోర్టు
న్యూఢిల్లీ : దేశంలో గోవధపై అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గోవధను నిషేధించాలని కేంద్రాన్ని కోరింది. ఆవును జాతీయ రక్షిత జంతువుగా ప్రకటించాలని తెలిపింది. గోవధ, అమ్మకానికి ఆవును తరలించినందుకు తనపై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని పిటిషనర్ మహ్మద్ అబ్దుల్ ఖాలిక్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ విచారణ జరిపారు. పిటిషనర్ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ మేరకు కేంద్రాన్ని పైవిధంగా అభ్యర్థించారు. '' మనం లౌకిక దేశంలో ఉంటున్నాం. హిందూ మతంతో పాటు అన్ని మతాల విశ్వాసాలను మనం గౌరవించాలి'' అని న్యాయమూర్తి అన్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఎంతో కాలంగా హిందూ సంస్థలు డిమాండ్లు చేస్తున్నాయి.