Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌పై విచారణ జరిపించాలంటూ ఆప్ కేంద్రాన్ని కోరింది. రాజస్తాన్ ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ చత్తీస్‌గఢ్ నుండి బొగ్గును తవ్వి తీస్తోందని, అయితే ఆ బొగ్గును ఆ కంపె నీకి చెందిన మరో ప్లాంట్‌కు తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదానీ బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆప్ ప్రతినిధి సంజరు సింగ్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరారు. మోడీ ప్రభు త్వానికి చెందిన దర్యాప్తు సంస్థలు అదానీ లక్ష్యంగా ఎందుకు దాడులు చేయడం లేదని మండిపడ్డారు. అదానీ కంపెనీ గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్‌కు 150 మెగావాట్ల విద్యుత్‌ను అందించే ఒప్పందాన్ని ఉల్లంఘిం చడంపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు గుజరాత్ ప్రభుత్వానికి గతేడాది అదనపు విద్యుత్ శాఖ కార్యదర్శి లేఖ రాశా రని కూడా సంజరు సింగ్ పేర్కొన్నారు. బొగ్గు సంక్షోభం సమయంలో కంపెనీ బొగ్గును అధిక ధరకు పవర్ ఎక్సేంజీలకు విక్రయించిందని లేఖలో పేర్కొన్నారు.