Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందస్తు బెయిల్..దర్యాప్తు అధికారుల బదిలీ
- కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే లంచం కేసు తీరిది..
బెంగళూరు: ప్రత్యర్థి పార్టీల నేతలపై ఈడీ,సీబీఐలను ఉసిగొల్పుతున్న మోడీ ప్రభుత్వం..కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప ఇంట్లో నోట్ల కట్టలు దొరికినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆయనకు ముందస్తు బెయిల్ లభించేదాకా ఎమ్మెల్యే జోలికివెళ్లలేదు. ఇపుడు లంచం కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులనే మార్చేశారు.
కర్నాటక హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని కోరిన తర్వాత ఇలా బదిలీ జరగటం గమనార్హం.
అసలేం జరిగిందంటే...
సాగరు రాజ్ ద్వారా: లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పకు కర్నాటక హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో, ఈ కేసులో దర్యాప్తు అధికారులను మార్చారు.
ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ మాదాల్ ..సాగరు రాజ్ నుంచి రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త జరిపిన దాడిలో పట్టుబడ్డాడు.క్యాష్ ఫర్ కాంట్రాక్ట్ కుంభకోణంలో, ఎమ్మెల్యే కుమారుడు వి ప్రశాంత్ మదాల్ నుంచి లోకాయుక్త గత వారం రూ. 8 కోట్లకు పైగా రికవరీ చేసింది. ఆ తర్వాత లోకాయుక్త లంచం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విరూపాక్షప్పను నంబర్ వన్ నిందితుడిగా పేర్కొన్నారు.
పరారీలో ఎమ్మెల్యే...
మాదాల్ విరూపాక్షప్పపై అవినీతి ఆరోపణలు రావడంతో పరారీలో ఉన్నాడు. లంచం కేసులో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని కోర్టు బీజేపీ ఎమ్మెల్యేను ఆదేశించింది. తిరిగి వచ్చిన ఆయనకు దావణగెరెలో మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది.
మరోవైపు లోకాయుక్త నిబంధనల ప్రకారం ఉచ్చు బిగించిన అధికారులు నిమగమయ్యారు.
లంచం కేసులో డిప్యూటీ ఎస్పీ ప్రమోద్ కుమార్, ఇన్ స్పెక్టర్ కుమారస్వామి విచారణాధికారులుగా ఉన్నారు. తాజాగా వారిని మార్చేసి... కొత్త దర్యాప్తు అధికారులుగా డిప్యూటీ ఎస్పీ ఆంథోనీ జాన్, ఇన్స్పెక్టర్ బాలాజీబాబు నియమితులయ్యారు.
కరాటక రాష్ట్రం దావణగెరె జిల్లా చన్నగిరి ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప తన కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. క్యాష్ ఫర్ కాంట్రాక్ట్ కుంభకోణంలో, ఎమ్మెల్యే కుమారుడు వి ప్రశాంత్ మదాల్ నుండి లోకాయుక్త గత వారం రూ. 8 కోట్లకు పైగా రికవరీ చేసింది. ఆ తర్వాత లోకాయుక్త లంచం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విరూపాక్షప్పను నంబర్ వన్ నిందితుడిగా పేర్కొన్నారు.
విరూపాక్షప్ప ఛైర్మన్గా ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కార్యాలయంలో లోకాయుక్త అధికారులు ట్రాప్ చేసి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
తదుపరి సోదాల్లో కేఎస్డీఎల్ కార్యాలయంలో సుమారు రూ.2 కోట్లు, ప్రశాంత్ ఇంటి నుంచి రూ.6 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రూ.8.23 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు, భూముల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు బయటపడ్డాయి.