Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 విక్రేతలకు గ్లోబల్ గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలో 200 మంది మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల కు ప్రపంచస్థాయి గుర్తింపు ఇవ్వడానికి గ్లోబల్ ఇంక్యుబేటర్ అయిన 'ఉమెన్ నోవేటర్'తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అమెజాన్ ఇండిమా తెలిపింది. అమెజాన్ రానున్న 24 నెలల పాటు నిర్వహించనున్న తన ఇ-కామర్స్ ఎగుమతుల కార్యక్రమం గ్లోబల్ సెల్లింగ్‌లో విక్రేతలుగా 'ఉమెన్నో వేటర్'లో 200 మంది మహిళా వ్యాపారవేత్తలను ఆన్‌బోర్డ్ చేయనున్నట్లు పేర్కొంది. దేశం నుంచి గ్లోబల్ బ్రాండ్లను రూపొందించేందుకు మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ భాగస్వామ్యం ఈ సహాయం చేస్తుందని పేర్కొంది. ఇందు కోసం మహిళ ఔత్సాహికవేత్తలతో కలిసి పని చేయనున్నట్లు తెలిపింది.