Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొజికోడ్ : రాబోయే దశాబ్దాల్లో కేరళలో సగానికి పైగా డాక్టర్లు మహిళలే వుండనున్నారు. రాష్ట్ర వార్షిక ఆర్థిక సమీక్ష ప్రకారం, కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్న మెడికల్ సైన్స్ సంబంధిత కోర్సులో 80 శాతానికి పైగా విద్యార్ధులు యువతులే. ఇతర కోర్సుల కేటగిరీతో పోలిస్తే ఈ కోర్సుల్లో మహిళలే ఎక్కువగా వున్నారు. ఆధునిక మెడిసిన్ కోర్సుల్లో 2021-22 విద్యా సంవత్సరంలో 5,398 మంది విద్యార్ధులు చేరగా, వారిలో 67శాతం అంటే 3616 మంది బాలికలే. జాతీయ సగటు 50శాతం కన్నా ఇది చాలా ఎక్కువగా వుంది. డెంటల్ కోర్సుల్లో మొత్తంగా 1907 మంది విద్యార్ధులు వుండగా, వారిలో 1640 మంది బాలికలే. హౌమియోపతి కోర్సు చేస్తున్న 385మంది విద్యార్ధులుండగా, వారిలో 345మంది బాలికలే.