Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేఘ-ట్రోపికస్-1 ఉపగ్రహం కూల్చివేత..
నెల్లూరు: భారత గగనతల చరిత్రలో ఉత్కంఠ దృశ్యం ఆవిష్కృత మైంది. ఇస్రో ఆపరేషన్ సక్సెస్ అయింది. ఓ ఉపగ్రహాన్ని భారత్ పూర్తి నియంత్రిత విధానంలో సేఫ్ గా మహా సముద్రంపై కూల్చి వేసింది. మేఘ-ట్రోపికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని పసిఫిక్ మహా సముద్రంపై విజయవంతంగా కూల్చివేసినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ ఉపగ్రహం భూ వాతా వరణంలోకి తిరిగి ప్రవేశించిందని.. ఆ తర్వాత పసిఫిక్ మహా సముద్రంలో విచ్ఛిన్నమవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగాన్ని విజయం తం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమా ల్లో పోస్టులు పెడుతున్నారు.చైనా ఉపగ్రహాలు తరచూ కక్ష్య నుంచి అదుపుతప్పి భూవాతవరణంలోకి దూసుకొచ్చిన శకలాలు ప్రపంచ దేశాలను వణికించిన ఘటనలు మనకు తెలిసిందే. దీంతో అప్రమత్తమైన భారత్ కాలం చెల్లిన ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చి వేయడంపై కసరత్తు చేసి విజయం సాధించింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఇలాంటి ఉపగ్రహాలను పేల్చే సత్తా భారత్కు ఉన్నప్పటికీ.. అలా చేస్తే వీటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారే ప్రమాదం ఉన్నందున నియంత్రిత విధానంలో వాటిని నిర్వీర్యం చేయడంపై కసరత్తు చేసింది. ఇందుకు గాను తక్కువ భూకక్ష్యలో పరిభ్రమించే 'మేఘ-ట్రోపికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని ఎంచుకున్న ఇస్రో.. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది. మేఘ-ట్రోపికస్-1ను 2011 అక్టోబర్ 12న ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ సీఎన్ఈసీతో కలిసి సంయుక్తంగా ప్రయోగించింది. ఉష్ణమండల వాతా వరణ, పర్యావరణంపై అధ్యయనానికి దీన్ని ఉపయోగించాయి. వాస్తవానికి మూడేళ్లు మాత్రమే ఈ ఉపగ్రహం పనిచేస్తుందని తొలుత అంచనా వేశారు. కానీ, ఇది 2021 వరకు నిరంతరాయంగా సేవలు అందించింది.