Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాలూ కుమార్తె రోహిణి
- లాలూ కుమార్తె ఇంట్లో ఐదు గంటలపాటు సీబీఐ.విచారణ...
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నిస్తోంది. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో లాలూ ,ఆయన కుమార్తె మీసా భారతి ఇంట్లో కొనసాగింది.
2004 నుంచి 2009 వరకు యూపీఏహయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదుచేసింది. బీహార్ మాజీ సీఎం లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. సోమవారం రబ్రీని ఆమె నివాసంలో ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం లాలూను విచారిస్తోంది.
నా తండ్రికి ఏదైనా జరిగితే.. ఎవర్నీ వదలను..
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి సీబీఐ గంటల తరబడి విచారిస్తోంది. దీనిపై లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని నిరంతరం వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే ఎవర్నీ వదలనని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.'తన తండ్రిని వేధిస్తోన్న తీరు సరికాదు. ఇవన్నీ గుర్తుంటాయి. సమయం అన్నింటికంటే శక్తివంతమైంది. ఆయనకు దిల్లీలోని పీఠాన్ని కదిలించే శక్తి ఇప్పటికీ ఉంది' అని అన్నారు. అలాగే సహనానికి కూడా హద్దు ఉంటుందని, దాన్ని కూడా పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డారు.ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం లాలూ ప్రసాద్ ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చారు. రోహిణినే ఆయనకు కిడ్నీ దానం చేసిన విషయం విదితమే.