Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశువులు తరలిస్తున్నాడంటూ ట్రక్ డ్రైవర్‌పై కాల్పులు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో గో గూండాలు మరోసారి రెచ్చిపోయారు. పశువులను అక్రమంగా తరలిస్తున్నాడన్న నెపంతో ఒక ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. లక్నోలోని మోహన్ నగర్లో బుధవారం ఉదయం ఒక కల్వర్ట్ వద్ద గో గూండాలు ఈ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో గాయపడ్డ డ్రైవర్‌ను ప్రేమ్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు.