Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తల : త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహాతో కలిసి 8 మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జె.పి. నడ్డాలతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మలు హాజరయ్యారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) నుంచి సుక్లా చరణ్ నొటియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బీజేపీ పాల్పడిన హింసాకాండకు నిరసనగా ప్రతిపక్ష సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.