Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధనకు ఒక రోజు నిరాహార దీక్ష
- 18 రాజకీయ పార్టీల మద్దతు
- హాజరుకానున్న 29 రాష్ట్రాల మహిళా హక్కుల ప్రతినిధులు
- భారీ ఏర్పాట్లు చేసిన భారత జాగృతి సంస్థ
న్యూఢిల్లీ : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత నేడు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జంతర్ మంతర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా కొన సాగనుంది. ఉదయం ఈ నిరాహార దీక్షను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారనీ, ఇందులో శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది, ఇతర నేతలు హాజరవుతారని చెప్పారు. తనతో పాటు దాదాపు 500ల మంది నిరహార దీక్ష చేపడుతారని చెప్పారు. మహిళా హక్కుల కోసం తాను చేస్తోన్న ఈ పోరా టానికి దేశంలోని 18 పొలిటికల్ పార్టీలు మద్దతు తెలి పాయని గురువారం కవిత వెల్లడించారు. బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుంచి ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలపనున్నట్టు చెప్పారు. అలాగే 29 రాష్ట్రాలకు చెందిన మహిళా హక్కుల పోరాట సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మొత్తంగా 5 నుంచి 6 వేల మంది ఈ ఆందోళనలో పాలుపంచు కుంటారని చెప్పారు.
ధర్నాకు భారీ ఏర్పాట్లు...
'చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల' సాధన కోసం ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ఒక రోజు నిరాహార దీక్ష కు జాగృతి సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సభావేదిక గురించి కొంత గందరగోళం నెలకొంది. ముందుగా తమకు కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు మార్చారని జాగృతి నేతలు ఆరోపించారు. ఆ స్థలాన్ని ఇతర ఆందోళనలు చేసే సంస్థలతో పంచుకోవాలని సూచించినట్టు చెప్పారు. కానీ, చివరకు అంతా ప్రశాంతంగానే సభ ఏర్పాట్లను చేసుకున్నారు.
ఏచూరితో కవిత భేటీి...
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో గురువారం ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. గోల్ మార్కెట్ లోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మహిళా రిజర్వేషన్ల సాధన దీక్షపై దాదాపు అరగంటకు పైగా నేతలిద్దరు చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... సీతారాం ఏచూరిని దీక్షకు ఆహ్వానించినట్లు చెప్పారు. 1996 లో అప్పటి ప్రధాని దేవగౌడ మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. అనంతరం ప్రతి ప్రధాని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసారన్నారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ కి మాత్రం మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చే ఆలోచన చేయలేదన్నారు. రానున్న బడ్జెట్ సెషన్ రెండో దఫాలో బిల్లు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. 131 ఫైనాన్స్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పాస్ చేసుకుందని, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ బిల్లు, సిటిజన్ షిప్ అమెండ్మెంట్ బిల్లు ఇలాంటి బిల్లులను గంటలలో చర్చలు లేకుండా పాస్ చేసుకున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికి నష్టం లేదని, దేశానికి, ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమైందన్నారు. బిల్లు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.