Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :ఆమాద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లో నూతన మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. స్థానిక రాజ్‌నివాస్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సిఎం కేజ్రీవాల్ సమక్షంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రామ్‌వీర్ సింగ్బిధుర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల దిల్లీ మద్యం కేసులో మనీశ్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడం, అంతకముందు మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు ఇటీవల రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను భర్తీ చేశారు. సిసోడియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు పబ్లిక్ వర్క్స్, విద్యుత్, పర్యాటక శాఖలను అతిషీ చూడనున్నారు.