Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిశితంగా పర్యవేక్షిస్తున్నాం : కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలోని ఇతర రకాల కన్నా ఈ వైరస్ కారణంగా ఎక్కువమంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తలెత్తుతున్న ఈ ఇన్ఫ్లూయంజా వైరస్ కారణంగా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తోంది, రాబోయే కొన్ని నెలల్లో ఇవి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భారత్లో ప్రతి ఏటా రెండు సీజన్లలో ఫ్లూ చాలా ఎక్కువగా వుంటుంది. ఒకటి జనవరి నుండి మార్చి వరకు, రెండోది వర్షాకాలం తర్వాత. సీజన్ కారణంగా వచ్చే ఫ్లూ కేసులు మార్చి చివరి నుండి తగ్గడం ప్రారంభమవుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్లను గుర్తించారు.