Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాల గొంతు నొక్కుతున్న టీఎంసీ
- త్రిపురలో ఎన్నికల అనంతర అలర్లకు వ్యతిరేకంగా బెంగాల్లో లెఫ్ట్ సంఘీభావ ర్యాలీ
- హాజరైన పలువురు నాయకులు, కార్యకర్తలు
న్యూఢిల్లీ : త్రిపురలో లెఫ్ట్, ప్రతిపక్షాలపై బీజేపీ తీవ్ర దాడులను చేస్తున్నదని వామపక్ష కూటమి ఆరోపించింది. అలాగే, పశ్చిమ బెంగాల్లో బీజేపీ తరహా విధానాన్ని అనుసరిస్తూ ప్రతిపక్షాల గొంతును అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం నొక్కివేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక అల్లర్లను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి సంఘీభావ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న నాయ కులు బీజేపీ, టీఎంసీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''త్రిపురలో ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం తయారైంది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. అనేక మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. 600కు పైగా దాడులు జరిగాయి. అనేక పార్టీల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఒక భయానక వాతావరణం తయా రైంది'' అని కోల్‌కతాలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ ముగింపు సందర్భంగా బెంగాల్ వామపక్ష కూటమి చైర్మెన్ బిమన్ బోస్ అన్నారు. మార్చి 2న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంట నే ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతు న్నాయి. ముఖ్యంగా, రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష కూటమి కార్యకర్తలు, మద్దతుదారులపై బీజేపీ దాడు లు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఇప్పటికే దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కోల్‌కతాలో వామపక్ష కూటమి జరిపిన నిర సన ర్యాలీకి పలువురు వామపక్ష కూటమి నాయ కులు పాల్గొన్నారు. బీజేపీ తీరును ఖండించారు. అలాగే, వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఇది త్రిపురకు అండగా నిలిచే ర్యాలీ అని మార్చ్ ప్రారం భానికి ముందు బిమన్ బోస్ అన్నారు.నేరస్థుల చేతుల్లో సాధారణ ప్రజలు దారుణంగా దాడులకు గురవుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 668 హింసాత్మక ఘటనలు చోటు చేసు కున్నాయని వామపక్ష కూటమి తెలిపింది. కనీసం ముగ్గురు మృతి చెందగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ హింసా త్మక ఘటనల్లో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయనీ, లూటీకి గురయ్యా యని వివరించింది.