Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో మోడీ ప్రభుత్వం విధించిన ఆస్తిపన్నుతో కాశ్మీర్‌లోయలో కలకలం మొదలైంది. ఈ పన్నును వ్యతిరేకిస్తూ శనివారం ప్రతిపక్షాలు, వ్యాపారులు, వాణిజ్య సంస్థలతో పాటు స్థానిక బిజెపి విభాగం జెసిసిఐ కూడా ఈ బంద్‌కు పిలుపునివ్వడం గమనార్హం. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ పన్నును ఉపసంహరించుకోవాలని ధ్వజమెత్తాయి. ఆస్తిపన్ను విధించే అధికారం ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఉందని, పన్ను విధించేందుకు ఓ విధానముందని జమ్ము చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (జెసిసిఐ) అధ్యక్షుడు అరుణ్ గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం లేదని అన్నారు. ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికైన మున్సిపాలిటీలను పరిపాలనా యంత్రాంగం అనుమతించాలని అన్నారు. ఎస్ఆర్ఒ జారీ చేయడం ద్వారా పరిపాలనా యంత్రాంగం స్థానిక సంస్థలను దాటవేసిందని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జి) ఆస్తిపన్ను విధించడం దురదృష్టకరమని.. ఇది ఎన్నికైన ప్రభుత్వానికి వచ్చే ప్రత్యేకాధికార మని చెప్పారు. సంప్రదింపులు, చర్చలు, సలహాలులేకుండా ఏకపక్షంగా పన్ను విధింపు నిర్ణయాన్ని తీసుకున్నారని మండిపడ్డారు. జెసిసిఐ జమ్ము ప్రాంతంలోని ప్రముఖ వ్యాపారుల కూటమి. బిజెపికి కంచుకోటగా ఉన్న జెసిసిఐ సమ్మెకు పిలుపునివ్వడంతో.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు. ఆస్తిపన్ను విధించని ఏకైక రాష్ట్రం జమ్ముకాశ్మీర్. ఆర్టికల్ 370 రద్దు ముందు వరకు ప్రజల ఆందోళనలతో పాలక ప్రభుత్వాలు ఆ పన్ను నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాయి.